
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,762 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది ఆరోగ్యశాఖ. అలాగే 3816 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇవాళ కరోనాతో 20 మంది మృతి చెందారని చెప్పింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,63,903 పెరిగాయని.. ఇప్పటివరకు 5,22,082 మంది వైరస్ నుంచి కోలుకున్నారని తెలిపింది. మరో 38,632 యాక్టివ్ కేసులున్నాయని. మొత్తం మరణాలు 3,189కి పెరిగాయని తెలిపింది. బుధవారం 91,048 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.