కటక్ లో భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 315 పరుగులు చేసింది. టీమిండియా మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో వెస్టిండీస్ బ్యాటింగ్ చేపట్టింది. భారత్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 316 పరుగులు చేయాల్సి ఉంది. వెస్టిండీస్ బ్యాట్స్ మెన్లు పూరన్ 89, పోలార్డ్ 74, హోప్ 42, ఛేజ్ 38, హెట్మెయిర్ 37, లూయిస్ 21 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు నవదీప్ షైనీ 2, షమీ, శార్దూల్, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీశారు.


