
హైదరాబాద్ ఓఆర్ఆర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జులై 18న తెల్లవారుజామున 3 గంటలకు ఆదిభట్ల ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడిక్కడే నలుగురు మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. పెద్ద అంబర్ పేట నుంచి బోంగ్లూర్ వైపు వెళ్తుండగా ఆదిభట్ల దగ్గర ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయ్యింది. మృతదేహాలు కారులో ఇరుక్కున్నాయి ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఇబ్రహీం పట్నానికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఒకరిని బీఎన్ రెడ్డి నగర్ లోని నీలాద్రి ఆసుపత్రికి తరలించారు. మృతులంతా యాదగిరి గుట్టకు వెళ్లి తిరిగివస్తుండగా నిద్రమత్తులో వేగంగా ఆగి ఉన్న లారీని వెనకనుంచి ఢీకొన్నట్లు తెలుస్తోంది.
మృతులు మొయినబాద్ గ్రీన్ వాలీ రిసార్ట్ లో పనిచేసే వారిగా గుర్తించారు. డ్రైవింగ్ చేసే మలోత్ చందు లాల్(డ్29) స్వస్థలం మాసంపల్లి తండా పాకాల కొత్తగూడా వరంగల్ జిల్లా. గగులోత్ జనార్దన్(50) దస్రుతండా స్వస్థలం వరంగల్ , కావలి బాలరాజు(40) ఎన్క పల్లి మొయినాబాద్ గా గుర్తించారు.