ఇరాన్, ఇజ్రాయోల్ వార్ పై అమెరికా రక్షణశాఖ కీలక ప్రకటన చేసింది. యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదు కానీ ముగిస్తామని ఆ దేశ రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సేత్ తెలిపారు. అణ్వాయుధాల తయారీని ఆపాలి..చర్చలకు రావాలని ఎన్ని సార్లు హెచ్చరించినా ఖమేనీ వినలేదన్నారు. మాట వినకుండా అణ్వాయుధాల తయారీ కొనసాగించారని అన్నారు. అమెరికా, ఇజ్రాయోల్ కు చావేనని ఖమేనీ బెదిరించారు. చివరకు యుద్ధంలో ఖమేనీ చనిపోయారని వెల్లడించారు. ఇరాన్ లో ఎట్టకేలకు 47 ఏళ్ల నియంత పాలనకు ముగింపు పలికామన్నారు.
ఇరాన్ లో పాలకులను మార్చేందుకు యుద్దం చేయలేదన్న పీఠ్ హెగ్సేత్.. కేవలం అణ్వాయుధాలను అంతం చేసేందుకు యుద్ధం చేస్తున్నామని చెప్పారు. యుద్ధంలో ఇరుపక్షాలకు నష్టం జరుగుతుందన్నారు. ఈ యుద్ధం కోసం నిబంధనలు సెట్ చేశామని చెప్పారు. తాము శత్రువులను జయిస్తామన్నారు. ట్రంప్ అమెరికన్లకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు పీట్ హెగ్సేత్.
ఖమేనీ భార్య మృతి
ఇజ్రాయెల్–అమెరికా సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే కూడా మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్–అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే సోమవారం (మార్చి 2) మరణించినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్–అమెరికా అటాక్స్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలుకూడా మరణించిన విషయం తెలిసిందే.
