This Week OTT Releases: వేసవి ముందే వినోదపు జల్లు.. ఈ వారం అలరించబోయే చిత్రాలివే!

This Week OTT Releases: వేసవి ముందే వినోదపు జల్లు.. ఈ వారం అలరించబోయే చిత్రాలివే!

మార్చి నెల వచ్చేసింది! వేసవి తాపం మొదలవ్వకముందే ఓటీటీలో వినోదపు జల్లులు కురిపించడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రముఖ ప్లాట్‌ఫారమ్స్. థియేటర్లో మిస్ అయిన సినిమాలు, నేరుగా డిజిటల్ స్క్రీన్ పైకి వచ్చే వెబ్ సిరీస్‌లు ఇలా ఈ వారం మీ సోఫాలో కూర్చుని ఎంజాయ్ చేయడానికి బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉంది. ఈ వారం ఏయే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలవుతున్నాయో చూద్దాం..

 ఓం శాంతి శాంతిహి (Om Shanti Shanti Shantihi)

మలయాళంలో సంచలన విజయం సాధించిన 'జయ జయ జయ జయ హే' చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లో ఆశించిన మేర ప్రభావం చూపలేకపోయినా, ఈ ఫ్యామిలీ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. ఇది ఆహాలో మార్చి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది.

 

ది రాజా సాబ్ - హిందీ (The Raja Saab)

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హారర్ కామెడీ 'ది రాజా సాబ్' ఇప్పటికే సౌత్ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే హిందీ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న ఉత్తరాది ప్రేక్షకులకు గుడ్ న్యూస్. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జియో హాట్‌స్టార్ లో మార్చి 6వ తేదీ నుంచి హిందీలో  స్ట్రీమింగ్ కానుంది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం డిజిటల్ వేదికపై ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ప్రస్తుతం

 

 సుబేదార్ (Subedaar)

బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనిల్ కపూర్ మరో పవర్‌ఫుల్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'సుబేదార్' అనే ఈ యాక్షన్ డ్రామాలో ఆయనతో పాటు రాధికా మదన్ కీలక పాత్ర పోషించింది. సురేష్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒరిజినల్ అమెజాన్ ప్రైమ్ మూవీ. ఇది తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మార్చి 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది

 

హలో బచ్చోం (Hello Bachhon)
ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫారమ్ 'ఫిజిక్స్ వాలా' వ్యవస్థాపకుడు అలఖ్ పాండే జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ డ్రామా ఇది. వినీత్ కుమార్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఒక సామాన్య ఉపాధ్యాయుడు దేశవ్యాప్తంగా ఎలా గుర్తింపు తెచ్చుకున్నాడనేది ఇందులో ఆసక్తికరంగా చూపించనున్నారు. మార్చి 6 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది.

 

చరిత కామాక్షి (Charitha Kamakshi): 
 

దివ్య శ్రీపాద, అభయ్ నవీన్ నటించిన 'చరిత కామాక్షి'  ఎమోషనల్ డ్రామా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ETV Win లో మార్చి 5 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రానికి  చందు సాయి దర్శకత్వం వహించారు. బుల్లితెరపై డెరెక్ట్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

 

గాంధీ టాక్స్ (Gandhi Talks): 

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి నటించిన చిత్రం 'గాంధీ టాక్స్'. ZEE5 లో మార్చి 6 నుండి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ మూవీలో అదితిరావు కీలక పాత్రలో నటించింది.

 

విక్రమ్ ఆన్ డ్యూటీ (Vikram on Duty): 

బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా నటించిన ఈ క్రైమ్ వెబ్ సిరీస్ 'విక్రమ్ ఆన్ డ్యూటీ ' . మార్చి 6 నుండి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. వేదవ్యాస్ అకుల దీనికి దర్శకత్వం వహించాడు 

 

విత్ లవ్ (With Love): 

అనస్వరా రాజన్, అనస్వర రాజన్ జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం 'విత్ లవ్'. థియేటర్లలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ క్యూట్ లవ్ స్టోరీ నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 6 నుండి అందుబాటులోకి రానుంది. తమిళం, తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాతో మధన్ దర్శకుడిగా అరంగేట్రం చేశాడు.

 

దేవగుడి (Devagudi): 
అభినవ్ శౌర్య, రఘు కంచె, అనుశ్రీ కీలక పాత్రలో నటించిన పల్లెటూరి నేపథ్య కథ 'దేవగుడి'.  బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సన్ నెక్స్ట్ (Sun NXT) లో మార్చి 3 నుండి ప్రసారం కానుంది.

 

జబ్ ఖులీ కితాబ్ (Jab Khuli Kitaab): 
 పంకజ్ కపూర్  డింపుల్ కపాడియా కీలక పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ' జబ్ ఖులీ కితాబ్'. ఇది థియేటర్లలో విడుదల కాలేదు నేరు మార్చి 6, 2026న  ZEE5లో విడుదలవుతోంది.  ప్రముఖ నటుడు, దర్శకుడు సౌరభ్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వృద్ధాప్యంలో ఉన్న ఒక దంపతుల మధ్య దాగి ఉన్న నిజాలు, భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. వారి పెళ్లి బంధం ఎదుర్కొనే సవాళ్లను ఈ కథలో ఆసక్తికరంగా చూపించనున్నారు. అయితే, ఈ వెబ్ ఫిల్మ్ కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంటుంది;

 

మార్చి నెల ప్రారంభంలోనే ఇన్ని వైవిధ్యమైన సినిమాలు ,రీస్‌లు రావడం ప్రేక్షకులకు పెద్ద పండగే అని చెప్పాలి. ముఖ్యంగా ప్రభాస్ 'రాజా సాబ్' హిందీ వెర్షన్ , అనిల్ కపూర్ 'సుబేదార్' పై భారీ అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు ఆకస్మికంగా డిజిటల్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.