వెలుగులోకి.. 400 ఏళ్ల నాటి పిల్లల అస్తి పంజరాలు.. చేతులు, కాళ్లకు తాళ్లు

వెలుగులోకి.. 400 ఏళ్ల నాటి పిల్లల అస్తి పంజరాలు.. చేతులు, కాళ్లకు తాళ్లు

భూమ్మీద కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ప్రత్యేకించి.. అంతుచిక్కని మిస్టరీలుగా భావించే వాటిని చేధించేందుకు నిరంతరం పరిశోధకులు కృషి చేస్తూనే ఉన్నారు. తాజాగా.. అలాంటి లిస్ట్‌ నుంచి ఓ మిస్టరీని చేధించే యత్నాల్లో ఒక ‘క్లూ’ చిక్కింది. ఒక చిన్న పిల్లాడికి చెందిన వాంపైర్‌(రక్తపిశాచి) అస్థిపంజరం ఒకటి అసాధారణ రీతిలో తవ్వకాల్లో బయటపడింది

యూరప్‌ దేశం పోలాండ్‌లోని ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్‌ అనే గ్రామంలోని ఓ స్మశానానికి ఆనుకుని ఉన్న  ప్రదేశంలో ఈ వ్యాంపైర్‌ (రక్తపిశాచి) సమాధిని గుర్తించారు. టోరన్‌లోని నికోలస్‌ కోపర్నికస్‌ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం ఈ పరిశోధన చేపట్టింది. అది 400 సంవత్సరాల నాటి పిల్లల అస్థిపంజరాలను కనుగొన్నారు.  దాని కాళ్లను ... చేతులను తాళ్లతో కట్టేసి  తాళాలు  వేసి ఉంది. అదే ప్రదేశంలో 30 మంది  పిల్లల అస్థిపంజరాలను కనుగొన్నారు.  గతంలోనే  ఈ అస్థికలు బయటపడ్డప్పటికీ.. తాజాగా ఇందుకు సంబంధించిన డాక్యుమెంటరీ, ఫొటోలు బయటపెట్టారు.  

ఆర్కియాలజీ బృందం శాస్త్రవేత్తలు పిల్లల వయస్సు 5 నుండి 7 సంవత్సరాల మధ్య ఉంటుందని చెబుతున్నారు.   నెక్రోపోలిస్‌లోని గుర్తు తెలియని సమాధిలో అవశేషాలను కనుగొన్నారు, ఈ పదం గ్రీకు నుండి ఉద్భవించింది, నెక్రోపోలిస్ అంటే చనిపోయిన వారి నగరం. గతంలో ఇక్కడ ఓ  పిశాచ మహిళను  ఖననం చేసినట్లు శాస్ర్తవేత్తల బృదం పేర్కొంది. ఆ మహిళ కాలి బొటనవేలుకి తాళం వేసి, మెడపై కొడవలిని ఉంచారు. అయితే శాస్త్రవేత్త డారిస్జ్ పోలిన్స్కి  నివేదిక ప్రకారం చనిపోయిన వారి కుటుంబ ఆచారాల ప్రకారం ఈ విధంగా ఖననం చేసి ఉండవచ్చని అభిప్రాయ పడ్డారు.  పాదాలకు తాళం వేయడమంటే ఇక అతని లేదా ఆమె జీవితం పరిసమాప్తమయిందని... మరల తిరిగి రాకుండా ఉండేందుకు ఇలా తాళాలు వేస్తారని తెలిపారు.  ఈ పద్దతులు జానపద ఆచారాలనుంచి ఉద్భవించాయని చెబుతున్నరు,  అయితే కొన్ని సందర్భాల్లో రక్తపిశాచాలకు వ్యతిరేకంగా ట్రీట్ చేస్తారని నివేదికలో పేర్కొన్నారు.  మృతదేహాలను  పూడ్చిపెట్టడం వల్ల మరణించిన వ్యక్తి మానవులకు హాని కలిగించకుండా నిరోధించవచ్చని పోలిన్స్కి తెలిపారు.  అయితే పిల్లల సమాధులకు దగ్గరగా ఉన్న మరో సమాధిని తవ్వినట్టు ఆయన తెలిపారు.  ఈ మృత దేహాలలోని ఒకరి దవడ భాగం ఆకుపచ్చ రంగులో ఉన్నట్లు గుర్తించామని పోలిన్స్కి నివేదిక ప్రకారం తెలుస్తోంది.   ఒక గర్ఛిణీ మృత దేహంలో 56 నెలల వయస్సు ఉన్న  పిండాన్ని గుర్తించినట్లు యూనివర్సిటీ ప్రతినిధి మాగ్డలీనా జాగ్రోడ్జ్కా తెలిపారు.  పిల్లల ఎముకల్లో తక్కువ ఖనిజ పోషకాలుంటాయన్నారు. 

గతంలో యూరప్‌ తూర్పు ప్రాంతంలోనూ ఈతరహా సమాధులు చాలానే బయటపడ్డాయి. వాటిలో చాలావరకు ఈ తరహాలోనే పాతిపెట్టబడ్డప్పటికీ.. తలలు, కాళ్లు చేతులు, తల తిప్పేసి ఉండడం, లేదంటే తల పూర్తిగా ధ్వంసమై ఉండడం లాంటి పరిస్థితుల్లో బయటపడ్డాయి. వాస్తవ-అవస్తవాలను పక్కనపెడితే.. వ్యాంపైర్‌ ప్రపంచం గురించి పరిశోధిస్తున్నవాళ్లకు.. ప్రత్యేకించి రచయితలకు ఈ అస్థికలు బయటపడడం మాత్రం ఓ కుతూహలాన్ని రేపుతోంది.