అజ్ఞాతం వీడిన 42 మంది మావోయిస్టులు

అజ్ఞాతం వీడిన 42 మంది మావోయిస్టులు
  • అందులో 11 మంది తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులు
  • 36 ఆయుధాలు, 800 గ్రాముల బంగారం అప్పగింత
  • మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ: డీజీపీ శివధర్ రెడ్డి
  • లొంగిపోయిన మావోయిస్టులకు తర్వలో హెల్త్​ కార్డులు
  • గణపతి సహా ఐదుగురు 
  • జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ‘పీపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిబరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెరిల్లా ఆర్మీ’ (పీఎల్బీఏ) బెటాలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన 42 మంది మావోయిస్టులు శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. వీరిలో ములుగు జిల్లాకు చెందిన కుంజం ఇడుమాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలియాస్ మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సహా తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీకి చెందిన 11 మంది మావోయిస్టులు ఉన్నారు. ఐదు ఏకే 47లు, ఐదు ఎస్ఎల్ఆర్, నాలుగు ఇన్సాస్ రైఫిల్స్ సహా 36 ఆయుధాలు, రెండు హ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రెనేడ్లు, 800 గ్రాముల గోల్డ్ బిస్కెట్లను పోలీసులకు అప్పగించారు. వీరి లొంగుబాటుతో సీపీఐ(మావోయిస్టు) పార్టీ తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ పూర్తిగా కనుమరుగైందని, తెలంగాణ ఇప్పుడు పూర్తిస్థాయిలో ‘మావోయిస్టు రహిత’ రాష్ట్రంగా అవతరించిందని ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సుమతి సహా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. లొంగిపోయిన  మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.4 లక్షల రివార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిగతా 41 మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున రూ.1.93 కోట్ల రివార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందజేశారు. 

రెండేండ్లలో 761 మంది లొంగుబాటు

పీపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిబరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెరిల్లా ఆర్మీకి చెందిన 42 మంది లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ మూడు ‘మ్యాజిక్ వెపన్స్’లో అత్యంత కీలకమైన  పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఏ) పూర్తిగా కనుమగైందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న గణపతి సహా ఐదుగురు తెలంగాణ ప్రాంత నేతలు లొంగిపోవాలని సూచించారు. ‘‘లొంగిపోయిన అగ్రనేతలు, పార్టీ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. తెలంగాణలో గత రెండేండ్లలో 761 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో దేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీ సహా ఈ ఏడాది ఇప్పటి వరకు 205 మంది కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జనజీవన స్రవంతిలో కలిసింది’ అని డీజీపీ పేర్కొన్నారు.

గణపతి బతికే ఉన్నాడు.. కానీ అడవుల్లో లేడు 

మావోయిస్ట్ పార్టీ కీలక నేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి బతికే ఉన్నాడని, కానీ అడవుల్లో లేడని డీజీపీ తెలిపారు. గణపతితో పాటు పసునూరి నరహరి, జాడే రత్నాభాయి, వార్త శేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రంగబోయిన భాగ్య జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. వీరంతా ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో సెంట్రల్ కమిటీ, స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ సభ్యులుగా పనిచేస్తున్నారన్నారు. లొంగిపోతే పునరావాసం సహా అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.  

లొంగిపోయిన మావోయిస్టులకు త్వరలోనే హెల్త్ కార్డులు

లొంగిపోయిన మావోయిస్టులందరికీ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు ఇస్తామని డీజీపీ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జీవోను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తారని చెప్పారు. హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులకు ఎలాంటి పరిమితి లేదని, నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా ఎంపిక చేసిన హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వైద్య సహాయం అందిస్తామని వెల్లడించారు. ఇటీవల లొంగిపోయిన అగ్రనేతలు ఇంకా పోలీసుల కస్టడీలోనే ఉండడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు డీజీపీ స్పందించారు. తమ దగ్గర ఎవ్వరూ లేరని, ఎవరి స్వస్థలాలకు వారు వెళ్లారని చెప్పారు. అలాగే తాము లొంగిపోలేదని మావోయిస్టులు చెప్పిన మాటలు గుర్తుచేయగా.. ‘టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతలు కాబట్టి లొంగిపోలేదని చెప్పారేమో. అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తే జైల్లో ఉంటారు కదా.. ఏదిఏమైనా సీఎం రేవంత్  పిలుపు మేరకు అజ్ఞాతం వీడిన మావోయిస్టులకు అండగా ఉంటున్నాం’ అని డీజీపీ వెల్లడించారు. మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టిన బాంబుల వెలికితీతలో మాజీలు, ప్రస్తుత పీపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిబరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెరిల్లా ఆర్మీ సహాయం తీసుకుంటామని చెప్పారు.