42 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

42 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం 42 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్ సెక్రటరీ టి.శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 21 మందిని ఎన్నికల్లో భాగంగా, మరో 21 మందిని రెగ్యులర్ బేసిస్‌‌‌‌లో బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో ఐదుగురికి ప్రమోషన్ ఇస్తూ ట్రాన్స్‌‌‌‌ఫర్ చేయడం గమనార్హం.