43 రోజుల షట్‌డౌన్ ముగిసింది: బిల్లుకు అమెరికా చట్టసభ ఆమోదం

43 రోజుల షట్‌డౌన్ ముగిసింది: బిల్లుకు  అమెరికా చట్టసభ ఆమోదం

43 రోజుల ప్రతిష్టంభన తర్వాత అమెరికా ప్రభుత్వ షట్​ డౌన్​ ముగిసింది.  షట్​ డౌన్​ ముగించేందుకు అమెరికా చట్ట సభ ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించింది. ఇక అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంఫ్ సంతకం చేయడమే ఆలస్యం. దాదాపు ఎనిమిది వారాల తర్వాత హౌస్ శాసనసభ్యులు దేశానికి తిరిగి వచ్చి సభలో పాల్గొన్నారు. 222–209 స్వల్ప మెజార్టీతో బుధవారం (నవంబర్​ 12) బిల్​ పాస్​ అయ్యింది. ఇప్పటికే ఈ బిల్లు సెనెట్​ లో ఆమోదం పొందింది. ఈ బిల్లును డొనాల్డ్​ట్రంప్​ సంతకం కోసం పంపారు. 

చరిత్రలో ఎన్నడూ లేనంతగా 43 రోజుల అమెరికా ప్రభుత్వ షట్​ డౌన్​ కొనసాగింది. దీంతో నిధులు లేక ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు రాక వీధినపడ్డారు. రికార్డు స్థాయిలో దీర్ఘకాలం కొనసాగిన షట్‌డౌన్‌లో ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ బిల్లుతో ప్రభుత్వ విభాగాలు మళ్లీ పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. వారాలుగా నిలిచిపోయి ఉద్యోగుల జీతాలు అందుకోనున్నారు.