విదేశాలకు 4,300 మంది మిలియనీర్లు..

విదేశాలకు 4,300 మంది మిలియనీర్లు..

న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలోనే దాదాపు 4,300 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు వెళ్లే అవకాశం ఉందని, వారిలో ఎక్కువ మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని తమ ప్రాధాన్యత గమ్యస్థానంగా ఎంచుకున్నారని గ్లోబల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ మైగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్స్ తాజా నివేదికలో పేర్కొంది. పోయిన ఏడాది 5,100 మంది విదేశాలకు వెళ్లిపోయారు. ఎక్కువ సంఖ్యలో దేశం విడిచిపెట్టిన సంపన్నులు ఉన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. కనీసం  మిలియన్ డాలర్లు (దాదాపు8.34 కోట్లు) సంపద ఉన్న వారికి  'మిలియనీర్లు' లేదా హై నెట్​వర్త్ ​ఇండివిడ్యువల్స్​ అంటారు. మిలియనీర్ల వలసల్లో యూకే, చైనా  తర్వాత భారతదేశం మూడవ స్థానంలో ఉంది.  2024 చివరి నాటికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6,700 మంది మిలియనీర్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌‌‌‌‌‌‌కు తరలి  వెళ్లనున్నట్లు అంచనా.