టెహ్రాన్: పశ్చిమాసియాలో కీలకమైన హార్మూజ్ జలసంధిని15 భారీ యుద్ధ నౌకలతో అమెరికా దిగ్బంధించింది. ఇరాన్ ఓడరేవుల నుంచి బయటకు వెళ్లే, లోపలికి వచ్చే అన్ని రకాల ఓడలపై ఆంక్షలు పెట్టింది. దీంతో ఇరాన్‌కు రోజూ సుమారు 435 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.4 వేల కోట్లు) మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. ఇందులో ప్రధానంగా ముడి చమురు, పెట్రోకెమికల్స్ ఎగుమతులు నిలిచిపోవడం వల్ల 276 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని అంచనా.
ఇరాన్ ఎగుమతుల కోసం ప్రత్యామ్నాయంగా ‘జాస్క్ టెర్మినల్’ను ఉపయోగించుకోవాలని చూస్తున్నప్పటికీ, అక్కడ ఉన్న పరిమితులు అడ్డంకిగా మారనున్నాయి. ప్రస్తుతం సముద్రంలో ఉన్న 154 మిలియన్ బారెళ్ల చమురు నిల్వలు స్వల్పకాలికంగా
ఇరాన్‌ను ఆదుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

