లంకకు 44 వేల టన్నుల యూరియా

లంకకు 44 వేల టన్నుల యూరియా

 కొలంబో: సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను ఇండియా తరఫున ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సాయం కొనసాగిస్తోంది. లంకలో వరి సాగు సీజన్ ప్రారంభమవడంతో అక్కడి రైతుల కోసం 44 వేల టన్నులకు పైగా యూరియాను తాజాగా కేంద్రం పంపింది. ఈ యూరియా ఆదివారం లంకకు చేరిందని ఇండియన్ హై కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు యూరియా అందజేత గురించి శ్రీలంక వ్యవసాయ మంత్రి మహీంద అమరవీరను కలిసి ఇండియన్ హై కమిషనర్ గోపాల్ బాగ్లే తెలియజేశారు. పొరుగు దేశంలో ఆహారభద్రత కొనసాగేలా చూసేందుకు, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంచుకునేందుకు వీలుగా ఈ సాయం చేస్తున్నట్లు హై కమిషన్ ట్వీట్ చేసింది. కాగా, ఆర్థిక సంక్షోభంలో ఉన్న లంకకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి నుంచి సుమారు 350 కోట్ల డాలర్ల సాయాన్ని లోన్లు, క్రెడిట్ లైన్ల రూపంలో అందజేసింది. కాగా, ఇండియా నుంచి లంక ఏటా 40 కోట్ల డాలర్ల ఫర్టిలైజర్స్ ను దిగుమతి చేసుకునేది. కానీ నిరుడు రసాయన ఎరువులు వాడొద్దని, దేశమంతా ఆర్గానిక్ సేద్యమే చేపట్టాలంటూ ప్రెసిడెంట్ గోటబయ తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయ రంగం కుదేలైంది. దిగుబడి ఏకంగా 50 శాతం పడిపోవడంతో దేశంలో 
ఁఆహార కొరతకు దారి తీసింది.