రాచకొండ కమిషనరేట్లో 446 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

రాచకొండ కమిషనరేట్లో 446 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

న్యూయర్ సందర్భంగా పలు ప్రాంతాల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 446 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఐదుగురికి 300 పాయింట్లకు మించి తాగడం గమనార్హం. అత్యధికంగా మల్కాజ్గిరి ట్రాఫిక్ డివిజన్లో 220 కేసులు నమోదయ్యాయి. పట్టుబడిన వారిలో 30 ఏళ్లలోపు యువకులే అధికంగా ఉన్నారు. 

ఇక నగరంలో ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఏటేటా పెరిగిపోతున్నాయి. కౌన్సిలింగ్ ఇచ్చినా వాహనదారుల్లో మార్పు రావటంలేదు. రిపీటెడ్ గా ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుపడుతున్నారు. ఇలాంటి వారి లైసెన్సులను సస్పెన్షన్ లో పెట్టారు ఆర్టీఏ అధికారులు. 2021లో 2వేల 599 మంది డ్రైవింగ్ లైసెన్సులను సస్పెన్షన్ లో ఉంచగా.. 2022లో ఆ సంఖ్య 5వేల 819కి చేరింది. హైదరాబాద్ పరిధిలోని ఐదు ఆర్టీఏ జోన్లలోనూ అధికారులు భారీగా డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేశారు. నార్త్ జోన్ లో 1103, సౌత్ జోన్ లో 1151, ఈస్ట్ జోన్ లో 510, వెస్ట్ జోన్ లో 1345 లైసెన్సులు రద్దు చేశారు.