మయన్మార్లో స్వల్ప భూకంపం

మయన్మార్లో స్వల్ప భూకంపం

మయన్మార్లో 2023 మే 22 సోమవారం రోజున  ఉదయం 8:15 నిమిషాలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.5 గా నమోదైనట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.  భూఉపరితలం నుంచి 14 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ  గుర్తించింది.   

భూ ప్రకంపనలకు పలు  ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.  మయన్మార్లో భూకంపం సంభవించడం ఇది రెండోసారి.అంతకుముందు మే 2న 4.2తీవ్రతతో భూకంపం సంభవించింది.