ఏపీలో మరో 34 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో 34 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా వేగంగా విస్తరిస్తుంది. రెండు రోజులుగా కరోనా కేసులు తక్కవగా నమోదైనా.. ఇవాళ ఒక్కరోజే మరో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా గుంటూరులో 16, కృష్ణలో 8, కర్నూలో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 473కు చేరగా..మృతుల సంఖ్య 9కి చేరింది.

ఒక్క గుంటూరులోనే 109 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 91, నెల్లూరులో 56, కృష్ణాలో 44,ప్రకాశంలో 42, కడపలో 31,చిత్తూరులో 23, పశ్చిమగోదావరిలో 23,విశాఖలో 20, అనంతపురంలో 17, తూర్పుగోదావరి జిల్లాలో 17 కరోనా కేసులు నమోదయ్యాయి.