
బషీర్బాగ్, వెలుగు: హైదరాబాద్ కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్లో మంచి బరువుతో బాలుడు జన్మించాడు. మారేడ్ పల్లికి చెందిన నూరియన్ సిద్ధికి అనే మహిళకు గురువారం తెల్లవారుజామున కింగ్ కోఠి హాస్పిటల్ డాక్టర్లు డెలివరీ చేశారు. నార్మల్ డెలివరీలో 5 కేజీల బరువు ఉన్న మగ శిశువు పుట్టాడు. హాస్పిటల్ చరిత్రలో ఇంత బరువున్న శిశువు పుట్టడం ఇదే మొదటిసారి అని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ బాబు తెలిపారు. తల్లి, బాబు క్షేమంగా ఉన్నారు.