వ్యాక్సిన్‌పై 5 శాతం జీఎస్టీ యథాతదం

V6 Velugu Posted on Jun 12, 2021

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆయా రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. జీఎస్టీ మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా చికిత్సకు ఉపయోగించే మూడు మందులకు, టెస్టింగ్ కిట్స్‌కు పన్ను మినహాయింపు ఇచ్చారు. కాగా కరోనా వ్యాక్సిన్‌పై మాత్రం 5 శాతం జీఎస్టీ విధించారు. కరోనా మందులు, చికిత్సకు వాడే పరికరాలపై పన్ను తగ్గించారు. 

కరోనా ఔషధాలు, కొన్ని వైద్య పరికరాలపై పన్నులు తగ్గించారు. అంబులెన్స్‌ సేవలపై 28 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు. టోసిలిజుమాబ్, యాంఫోటెరిసిన్ బి ఔషధాలపై పన్ను మినహాయింపు ఇచ్చారు. రెమ్‌డెసివిర్ ఔషధంపై జీఎస్టీ 12% నుంచి 5 శాతానికి తగ్గించారు. ఆక్సిజన్‌ యూనిట్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాలు, వెంటిలేటర్లు, ఇతర సంబంధిత పరికారాలపై జీఎస్టీ 12% నుంచి 5 శాతానికి తగ్గించారు. కోవిడ్ టెస్ట్ కిట్లు, యంత్రాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. వ్యాక్సిన్లపై మాత్రం 5 శాతం జీఎస్టీ కొనసాగిస్తామని తెలిపారు. ఉష్ణోగ్రతలు లెక్కించే పరికరాలు, శానిటైజర్లపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ జీఎస్టీ తగ్గింపులు, మినహాయింపులు  సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.

Tagged India, Nirmala Sitharaman, corona vaccine, corona virus, ambulances, GST Council, corona medicines, gst on corona vaccine, corona vaccine gst

Latest Videos

Subscribe Now

More News