నవంబర్ 17న మధ్యప్రదేశ్.. నవంబర్ 23న రాజస్థాన్ పోలింగ్

నవంబర్ 17న మధ్యప్రదేశ్..  నవంబర్ 23న రాజస్థాన్ పోలింగ్

ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల  ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్  కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు.  తెలంగాణతో పాటు  రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. ఐదు రాష్ట్రాల్లో 579 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 16.14 కోట్ల ఓట్లు ఉన్నాయని సీఈసీ ప్రకటించింది. 

మధ్యప్రదేశ్  ఎన్నికల షెడ్యూల్ 

నోటిఫికేషన్ తేదీ : అక్టోబర్ 21
నామినేషన్ల చివరి తేదీ :అక్టోబర్ 30
నామినేషన్ల పరిశీలన చివరి తేదీ : అక్టోబర్ 31
అభ్యర్థుల ఉపసంహరణ చివరి తేదీ : నవంబర్ 2 తేదీ
పోలింగ్ తేదీ : నవంబర్17వ తేదీ
ఓట్ల లెక్కింపు : డిసెంబర్ 3వ తేదీ, 2023

రాజస్థాన్ ఎన్నికల షెడ్యూల్

నోటిఫికేషన్ తేదీ : అక్టోబర్30
నామినేషన్ల చివరి తేదీ :నవంబర్ 6
నామినేషన్ల పరిశీలన చివరి తేదీ : నవంబర్ 7
అభ్యర్థుల ఉపసంహరణ చివరి తేదీ : నవంబర్ 9 తేదీ
పోలింగ్ తేదీ : నవంబర్23 తేదీ
ఓట్ల లెక్కింపు : డిసెంబర్ 3వ తేదీ, 2023