యాలాల మండలంలోని 5 తులాల బంగారం, కిలోన్నర వెండి చోరీ

యాలాల మండలంలోని 5 తులాల బంగారం, కిలోన్నర వెండి చోరీ

తాండూరు, వెలుగు: తాళం వేసిన ఇంట్లోని బంగారం, వెండిని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం కోకట్ గ్రామంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. ముచ్చర్ల వెంకటేశం గత బుధవారం కుటుంబసభ్యులతో కలిసి సేడం వెళ్లాడు. శుక్రవారం ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. 

లోపలికి వెళ్లి బీరువాలో చూడగా.. 5 తులాల బంగారం, కిలోన్నర వెండి కనిపించలేదు. దొంగతనం జరిగిందని నిర్ధారించుకొని ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.