గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లోని ఓ ప్రైవేటు హాస్టల్లో లిఫ్ట్‌లో ఇరుక్కొని ఓ ఐదేండ్ల చిన్నారి కన్నుమూసింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి లిఫ్ట్‌కు ఉన్న రెండు ఇనుప గేట్ల మధ్యలో ఇరుక్కొని తలకు తీవ్ర గాయాలై ప్రాణాలిదిలింది. జార్ఘండ్ రాష్ట్రానికి చెందిన మోహన్ఘోష్ కుటుంబంతో కలిసి కొన్నేండ్ల కింద సిటీకి వచ్చాడు. ఐటీ కారిడార్ గౌలిదొడ్డిలోని మహీ ఉమెన్స్పీజీ హాస్టల్లో వంట మనిషిగా పనిచేస్తూ.. భార్య కెంతూ ఘోష్, కొడుకు బిట్టు ఘోష్, కోడలు, మనువరాలు బిస్తు ఘోష్(5) తో కలిసి హాస్టల్లోనే ఉంటున్నారు. తండ్రితో కలిసి బిట్టు ఘోష్ ఇదే హాస్టల్లో వంట పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం హాస్టల్లో బిస్తు ఘోష్ ఆడుకుంటుండగా.. కుటుంబసభ్యులు ఎవరి పనుల్లో వారున్నారు.
బిస్తు ఘోష్ ఆడుకుంటూ వెళ్లి హాస్టల్లోని లిఫ్ట్ డోర్లు తెరిచింది. లోపలకు వెళ్లే క్రమంలో లిఫ్ట్రెండు గ్రిల్స్డోర్ల మధ్య ఇరుక్కుపోగా.. లిఫ్ట్కింద నుంచి ఐదో ఫ్లోర్‌కు వెళ్లి, అక్కడి నుంచి మూడో ఫ్లోర్‌కు వచ్చి నిలిచిపోయింది. లిఫ్ట్ ఆగిపోవడంతో అపార్ట్‌మెంట్‌వాసులు గమనించగా లిఫ్ట్రెండు డోర్ల మధ్య బిస్తు ఘోష్ నుజ్జునుజ్జయి చనిపోయి కనిపించింది. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బిస్తుఘోష్ను బయటకు తీశారు. అప్పటి వరకు కళ్లేదుటే ఆడుకుంటున్న చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది.
