కుషాయిగూడలో 54 అడుగుల హనుమాన్ విగ్రహం ఆవిష్కరణ

కుషాయిగూడలో 54 అడుగుల  హనుమాన్ విగ్రహం ఆవిష్కరణ

మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి, వెలుగు: కుషాయిగూడ మార్కెట్ సమీపంలో శుక్రవారం 54 అడుగుల భారీ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. భక్తుల జయజయధ్వానాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ, కుషాయిగూడ ప్రాంతం భవిష్యత్తులో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ విగ్రహం ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెస్తుందన్నారు.