ఇరిగేషన్​లో ఈ ఏడాది ..56 మంది రిటైర్మెంట్

ఇరిగేషన్​లో ఈ ఏడాది ..56 మంది రిటైర్మెంట్

హైదరాబాద్, వెలుగు :  ఇరిగేషన్​డిపార్ట్ మెంట్ లో ఈ ఏడాది 56 మంది ఇంజనీర్లు రిటైర్​కానున్నారు. ఈఎన్సీ నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ఇంజనీర్ వరకు రిటైర్​అవుతున్న వారి జాబితాను డిపార్ట్​మెంట్​సోమవారం రిలీజ్​చేసింది. రిటైర్​అవుతున్న వారిలో ఓ అండ్​ఎం ఈఎన్సీ నాగేందర్​రావు, సీఈలు విష్ణు ప్రసాద్, శ్రీనివాస్​రెడ్డి, అజయ కుమార్, విజయ భాస్కర్​రావు ఉన్నారు. 

22 మంది ఎస్ఈలు రిటైర్​కానున్నారు. వారిలో బీఆర్ఎస్​ప్రభుత్వంలో ఇరిగేషన్, సీఎం ఓఎస్డీగా పని చేసిన శ్రీధర్​దేశ్​పాండే, ఇరిగేషన్ టెక్నికల్​సెక్రటరీ భీమ్​ప్రసాద్ ఉన్నారు. 19 మంది ఎగ్జిక్యూటివ్​ఇంజనీర్లు, పది మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్​ఇంజనీర్లు ఈ ఏడాది రిటైర్​అవుతున్నారు.