
హైదరాబాద్, వెలుగు: విజయ డెయిరీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికై శిక్షణ పూర్తిచేసుకున్న 57 మందికి శుక్రవారం పోస్టింగ్ ఇచ్చారు. తార్నాకలోని విజయ డెయిరీ ఆఫీస్‌లో టీఎస్‌డీడీసీ ఎండీ శ్రీనివాస్ రావు వారికి పోస్టింగ్ లెటర్స్ అందజేశారు. వీరంతా ఉమ్మడి 8 జిల్లాల్లోని ఆయా విజయ డెయిరీ బ్రాంచీల్లో పనిచేస్తారు. ఇప్పటివరకు డెయిరీలో 250 మంది పనిచేస్తుండగా వారికి తాజాగా ఎంపికైన 57 మంది తోడయ్యారు.