హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఎప్ సెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,918 మంది అభ్యర్థులు తమ వివరాలను మార్చుకున్నట్లు ఎప్ సెట్ కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లోనే 4,566 మంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 1,348 మంది తమ వివరాలను సవరించుకున్నారు.
ఇక ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారిలో నలుగురు మాత్రమే ఎడిట్ ఆప్షన్‌ను వాడుకున్నారు. అభ్యర్థులు ప్రధానంగా పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, అడ్రస్ వంటి వివరాల్లో జరిగిన తప్పులను సరిచేసుకున్నారు.
