ఐదో వన్డే : న్యూజిలాండ్ టార్గెట్-253

ఐదో వన్డే : న్యూజిలాండ్ టార్గెట్-253

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. 49 ఓవర్లలో 252 రన్స్ కు ఆలౌంటైంది. టీమిండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 20 రన్స్ లోపే 4 కీలక వికెట్లను కోల్పోయింది.  ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు, విజయ్ శంకర్ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలోనే రాయుడు (90) హాఫ్ సంచరీ చేశాడు. రాయుడుతో కలిసి ఐదో వికెట్‌ కు 98 రన్స్ జోడించి టీమ్‌ ను ఆదుకున్నాడు విజయ్ శంకర్. దూకుడుగా ఆడిన శంకర్(45) 31వ ఓవర్ లో రన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కేదార్ జాదవ్ (34)తో కలిసి ఆరో వికెట్‌ కు 74 రన్స్ జోడించాడు రాయుడు. వన్డేల్లో మరో సెంచరీ చేస్తాడనుకున్న సమయంలో 90 పరుగుల దగ్గర ఓ భారీ షాట్ ఆడబోయి ఔట్ అయ్యాడు రాయుడు. చివర్లో వచ్చిన పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 22 బాల్స్ లోనే 45 రన్స్ చేశాడు. 5 సిక్సులు, 2 ఫోర్లలో చెలరేగాడు. అంబటి, పాండ్యా అద్భుతమైన ఆటతో.. కివీస్ కు చాలెంజింగ్ టార్గెట్ విసిరింది టీమిండియా.

కివీస్ బౌలర్లలో..హెన్రీ 4, బోల్ట్ 3, నిశామ్ 1 వికెట్లు తీశారు.