అడ్వొకేట్లకు రూ.6 లక్షల బీమా

అడ్వొకేట్లకు రూ.6 లక్షల బీమా
  •  రూ.4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచిన  స్టేట్‌‌‌‌ బార్ కౌన్సిల్ 

హైదరాబాద్, వెలుగు: న్యాయవాదులకు జీవిత బీమాను రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచుతూ స్టేట్‌‌‌‌ బార్‌‌‌‌ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ నిర్ణయం తీసుకుంది. గత ఏప్రిల్‌‌‌‌ 6న కౌన్సిల్‌‌‌‌ భేటీలో అడ్వొకేట్స్‌‌‌‌ వేల్ఫేర్‌‌‌‌ ఫండ్‌‌‌‌ యాక్ట్‌‌‌‌లోని సెక్షన్‌‌‌‌16(2) ప్రకారం పెంపునకు నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్‌‌‌‌ బార్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ ఏ.నరసింహారెడ్డి గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కౌన్సిల్‌‌‌‌ పరిధిలో దాదాపు 53,220 మంది న్యాయవాదులుగా ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ అయ్యారని, జులై 1 నుంచి ఈ పెంపుదల నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపారు.