ఆహారం కల్తీ చేసే వారికి కఠిన శిక్షలు ఉండాలె!

ఆహారం కల్తీ చేసే వారికి కఠిన శిక్షలు ఉండాలె!

న్యూఢిల్లీ : ఆహారాన్ని, డ్రింక్స్​ను కల్తీ చేస్తూ అమ్మేవారికి 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించాలని పార్లమెంటరీ ప్యానెల్​ సిఫారసు చేసింది. కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల తలెత్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యల దృష్ట్యా, ఇప్పటి వరకు విధిస్తున్న శిక్ష సరిపోదని బీజేపీ ఎంపీ బ్రిజ్‌‌లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. ప్రస్తుతం ఆహారం కల్తీ చేసేవారికి ఆరు నెలల వరకు జైలు లేదా రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలూ వేస్తున్నారు. ఫుడ్ ​కల్తీకి పాల్పడే వారికి కఠిన శిక్ష ఉండాల్సిందేనని భావించిన కమిటీ.. 6 నెలల జైలు శిక్ష తప్పనిసరిగా విధించడంతో పాటు రూ.25 వేలు ఫైన్​ వేయాలని సిఫారసు చేసింది. కేంద్రం తీసుకొస్తున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లులను పరిశీలించిన పార్లమెంటరీ కమిటీ.. ఈ సూచనలు చేసింది.