భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మహిళలతో సహా ఆరుగురు సజీవదహనం

భారీ అగ్నిప్రమాదం.. నలుగురు మహిళలతో సహా ఆరుగురు సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ దారుణ సంఘటన జనవరి 18వ తేదీ గురువారం రాత్రి ఢిల్లీలోని పీతంపుర ప్రాంతంలో చోటుచేసుకుంది. భవనం మొదటి అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి క్రమంలో బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భవనంలో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనం అయ్యారు.

 స్థానికుల సమాచారంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్ని ప్రమాద సిబ్బంది ఫైరిజన్లతో మంటలను అర్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో నలుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన షాట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.