ముంబై నుంచి మంచిర్యాలకు వచ్చిన ఏడుగురికి కరోనా

ముంబై నుంచి మంచిర్యాలకు వచ్చిన ఏడుగురికి కరోనా

కరోనా వైరస్‌ మంచిర్యాల జిల్లా వాసులను కలవర పెడుతోంది. ఈ క్రమంలో ముంబై నుంచి జిల్లాలోని స్వస్థలాలకు  తిరిగి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయినట్లు జిల్లా కొవిడ్‌-19 నోడల్‌ ఆఫీసర్‌ తెలిపారు. కరోనా వైరస్‌ సోకిన వారిలో దండెపల్లి, జన్నారం, లక్సెట్టిపేట, బెల్లంపల్లికి చెందిన వారున్నారు. వీరందరిని అధికారులు గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించారు . కొద్ది రోజుల క్రితమే వీరు ముంబై నుంచి సొంత ఊళ్లకు తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం 18 కరోనా పాజిటివ్‌ కేసులు నవెూదు కాగా వీరిలో లో 17 మంది వలస కార్మికులున్నారు.