సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ చెందుతుండడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ రోజుల్లో ఆర్టిస్ట్ లు అవసరం లేకుండా.. డిజిటల్ క్రియేషన్స్ తో ప్రపంచంలో సాధ్యం కాని పనులను, చిత్రాలను కూడా చేసి చూపిస్తోంది. కారణం AI కి భారీ స్థాయిలో వస్తోన్న స్పందనే. మిడ్‌జర్నీ వంటి యాప్‌లను ఉపయోగించి సృష్టించిన కొన్ని అత్యంత సృజనాత్మక చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. అవేంటో చూద్దాం..
AI- రూపొందించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "స్లమ్‌డాగ్ బిలియనీర్స్"గా చెప్పబడిన ఈ పిక్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ బిలియనీర్‌లు కావడం గమనార్హం. వీరిలో ఎలోన్ మస్క్ నుంచి జెఫ్ బెజోస్ వరకు ఉండడం గమనార్హం.
ఆర్టిస్ట్ గోకుల్ పిళ్లై ప్రపంచంలోనే అత్యంత ధనవంతులను పేదలుగా చిత్రీకరించేందుకు మిడ్‌జౌనీ అనే యాప్ ను ఉపయోగించారు. AI రూపొందించిన ఈ చిత్రాలు కొద్ది సేపట్లోనే వైరల్ అయ్యాయి. ఈ చిత్రాలను గనక పరిశీలిస్తే బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, ముఖేష్ అంబానీ, వారెన్ బఫెట్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ తో పాటు ఎలోన్ మస్క్ కూడా ఉన్నారు.
ఈ ఫొటోల్లో బిలయనీర్లు అత్యంత పేదలుగా కనిపిస్తు్నారు. మురికి, మాసిపోయిన టీ షర్టులు, బనియన్ లు వేసుకుని ఉండడం చూడవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరంతా స్లమ్ ఏరియాలో నిలబడి ఉన్నట్టు కనిపిస్తోంది. చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తోన్న ఈ ఫొటోలు.. బిలియనీర్లు రియల్‌గా తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఈ పోస్ట్‌కి ఇప్పటివరకు 10వేలకు పైగా లైక్‌లు వచ్చాయి, అనేక కామెంట్లు కూడా వచ్చాయి. ఆర్టిస్ట్ లు తమ అద్భుతమైన పనులను రూపొందించడానికి AI సాధనాలను ఎలా ఉపయోగిస్తున్నారనే దానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేసిన పిళ్లై.. “స్లమ్‌డాగ్ మిలియనీర్స్. (ఈ జాబితాలో ఇంకా ఎవరినైనా నేను మిస్ అయ్యానా?)” అనే క్యాప్షన్ ను జత చేశాడు.
AI- రూపొందించిన బిలియనీర్ల చిత్రాలు :
1. బిల్ గేట్స్
2. డొనాల్డ్ ట్రంప్
3. మార్క్ జుకర్‌బర్గ్
4. ముఖేష్ అంబానీ
5. జెఫ్ బెజోస్
6. ఎలోన్ మస్క్
7. వారెన్ బఫెట్
ఈ పోస్ట్ పై నెటిజన్లు పలురకాలుగా కామెంట్లు పెడుతున్నారు. "అవి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి... స్లమ్‌డాగ్ బిలియనీర్ లాగా ఉన్నాయి అని ఒకరు చెప్పగా.. “ఇది ఇతిహాసం” అని మరొకరు వ్యాఖ్యానించారు. ఎలాన్ మస్క్ ను వర్ణనను ప్రస్తావిస్తూ.. “ఇది బంగారం! కానీ ఎలాన్ ఒక్కడే పేదవాడైనప్పటికీ ధనవంతుడిగా కనిపిస్తాడు" అని మరొకరు భిన్నమైన కామెంట్ చేశారు.

