ఛలో ఢిల్లీ: 7 ప్రపంచ వింతలు.. ఒకే చోట

ఛలో ఢిల్లీ: 7 ప్రపంచ వింతలు.. ఒకే చోట
  • 7 వండర్స్ చూడ్డానికి ప్రపంచమంతా తిరగక్కర్లేదు!

7-world-wonders-in-delhiన్యూఢిల్లీ: ఏడు ప్రపంచ వింతలు.. జీవితంలో ఒక్కసారైనా చూసొద్దం అని చాలా మందే కోరుకుంటుంటారు. కానీ, ప్రపంచంలో ఒక్కో దిక్కున ఉన్న వాటిని చూసే స్థోమత  లేదే అని నిరాశ. రెక్కలు కట్టుకుని ప్రపంచం చుట్టురావాలని కోరిక ఉన్న డబ్బులు కొరత కాళ్లకు బంధాలు వేసేస్తుంది. ఇలాంటి పరిస్థితిని మీరూ ఎదుర్కొంటున్నారా? ప్రపంచ వింతలు చూడాలనే ఆశతో ఉవ్వుళ్లూరుతున్నారా? అయితే ఈ చాన్స్ మీ కోసమే గెట్ రెడీ!

మన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి రాగలిగే శక్తి ఉంటే చాలు ప్రపంచ వింతలన్నీ కనులారా చూడొచ్చు. సౌత్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల క్రియేటివ్ థాట్.. ఏడు ప్రపంచ వింతలను ప్రతి సృష్టి చేసింది. ఇక్కడి ఓ పార్కులో వాటిని ఏర్పాటు చేసింది. వీటిని చూసి ఆనందించేందుకు ప్రజలకు త్వరలోనే ప్రవేశం కల్పించబోతున్నారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే 7 వండర్స్ నమూనాలను ‘చెత్త’తో రీక్రియేట్ చేశారు.

తాజ్ మహల్ (ఆగ్రా – ఇండియా)

ఈఫిల్ టవర్ (పారిస్ – ఫ్రాన్స్)

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్ – అమెరికా)

లీనింగ్ టవర్ ఆఫ్ పీసా (పీసా నగరం – ఇటలీ)

క్రైస్ట్ ది రిడీమర్ స్టాట్యూ (రియోడిజనిరో – బ్రెజిల్)

గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా (ఈజిప్టు)

కొలోజియం (రోమ్)