జీహెచ్ఎంసీ స్పెషల్ డ్రైవ్ లో 7,258 గుంతలు పూడ్చివేత

జీహెచ్ఎంసీ  స్పెషల్ డ్రైవ్ లో 7,258 గుంతలు పూడ్చివేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: జులై 29 నుంచి ఈ నెల 8 వరకు జీహెచ్ఎంసీ చేపట్టిన రోడ్ సేఫ్టీ డ్రైవ్‌‌‌‌ లో భాగంగా గ్రేటర్ లో ఇప్పటి వరకు 7,258 గుంతలు పూడ్చినట్లు మెయింటెనెన్స్ సీఈ సహదేవ్ రత్నాకర్ తెలిపారు. అలాగే 333 క్యాచ్ పిట్ లకు మరమ్మతులు, 114 క్యాచ్ పిట్ ల మార్పు, 3 ప్రాంతాల్లో సెంట్రల్ మీడియన్ మరమ్మతులు చేపట్టినట్లు ప్రకటించారు.