దర్యాప్తు సంస్థలను బీజేపి దుర్వినియోగం చేస్తోంది

దర్యాప్తు సంస్థలను బీజేపి దుర్వినియోగం చేస్తోంది

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే సహా 75 మంది కాంగ్రెస్ ఎంపీలు, పలువురు కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పి. చిదంబరం, అజయ్ మాకెన్, మాణికం ఠాగూర్, కెసి వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి, శశి థరూర్, సచిన్ పైలట్, హరీష్ రావత్, అశోక్ గెహ్లాట్, కె సురేష్ తదితరులను కింగ్స్ వే క్యాంప్ పోలీస్ లైన్స్కు తరలించారు. పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న సమయంలోఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 


ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ దర్యాప్తు సంస్థలను బీజేపీ దర్వినియోగం చేస్తుందని  మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఎంత బలంగా ఉందో కమలనాథులు చూపించాలనుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సభలో ద్రవ్యోల్బణం సమస్యను లేవనెత్తినా.. అధికార పార్టీ పట్టించుకోలేదని నేతలు వాపోయరు. ఇప్పుడు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశాన్ని లేవనెత్తామని ఖర్గే స్పష్టం చేశారు.