ఒక్క రోజే రిజిస్ట్రేష‌న్ల‌ కోసం 758 స్లాట్ బుకింగ్స్

ఒక్క రోజే రిజిస్ట్రేష‌న్ల‌ కోసం 758 స్లాట్ బుకింగ్స్

అన్ని జోన్లలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాయి. నెలన్నర రోజులుగా కొన్ని రిజిస్ట్రార్ ఆఫీసులు తెరిచినా.. ప్రజలెవరూ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అన్ని జోన్లలో రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు జనంరాక పెరిగింది. ఏప్రిల్ లో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్స్ మొత్తం 1,636 మాత్రమే కాగా.. బుధవారం ఒక్క రోజే 758 స్లాట్స్ బుక్ అయ్యాయి. రిజిస్ట్రార్ ఆఫీసులోకి వ‌చ్చే ప్రతి ఒక్కరూ మాస్కుపెట్టుకుని, హ్యాండ్ వాష్ చేసుకున్నాకే లోపలికి రానిస్తున్నారు. బయోమెట్రిక్ తప్పనిస‌రి కావడంతో రెండు పార్లు వారికి శానిటైజర్ అందజేస్తున్నారు.