హైదరాబాద్, వెలుగు : డీఈడీ, డీపీఎస్కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన డీఈఈసెట్-2023 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఎగ్జామ్‌లో
77.18% మంది క్వాలిఫై అయ్యారని డీఈఈసెట్ కన్వీనర్ శ్రీనివాస్‌చారి తెలిపారు. ఈ నెల1న పరీక్ష జరగగా.. 5,150 మంది పరీక్ష రాశారు. దీంట్లో 3,975 మంది క్వాలిఫై అయ్యారు. పరీక్ష రాసిన 837 మంది అబ్బాయిల్లో 712 మంది, అమ్మాయిలు 4,313 మందికి 3,263 మంది అర్హత సాధించారు.
తెలుగు మీడియంలో 2,043 మంది రాయగా.. 1,551 (75.91%) మంది క్వాలిఫై అయ్యారు. ఇంగ్లిష్ మీడియంలో 2,495 మందికి 2,114 (84.72%) , ఉర్దూ మీడియంలో 612 మందికి 310 (50.65%) మంది క్వాలిఫై అయ్యారు. ఇంగ్లిష్ మీడియంలో షేక్ మస్తాన్ పాషా, తెలుగు మీడియంలో మాధవరావు, ఉర్దూమీడియంలో జవేరియా ఫిర్దోస్ టాపర్లుగా నిలిచారు. కాగా రాష్ట్రంలో 10 గవర్నమెంట్ డైట్ కాలేజీల్లో 1,400 సీట్లుండగా, 62 ప్రైవేటు కాలేజీల్లో 3,350 సీట్లున్నాయి. త్వరలోనే అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
