- ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు
హైదరాబాద్,- వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-–27 విద్యా సంవత్సరానికి ఆదివారం నిర్వహించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 82.02 శాతం హాజరు నమోదైందని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు నుంచి పదో తరగతి వరకూ ప్రవేశాల కోసం మొత్తం 37,216 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 30,526 మంది పరీక్షకు హాజరయ్యారు.
వివిధ కారణాలతో 6,690 మంది అటెండ్ కాలేదు. ఆరో తరగతి కోసం 23,958 మంది అప్లై చేయగా 19,584 (81.74%) మంది పరీక్ష రాశారు. ఏడో తరగతికి 4,281 మంది, 8వ తరగతికి 3,908, తొమ్మిదో తరగతికి 2,277 మంది, పదో తరగతికి 476 మంది అటెండ్ అయ్యారు.

