
ముంబై: తోపుడు బళ్లపై ఇడ్లీలు, దోశలు చాలా రుచికరంగా ఉంటాయి. బజ్జీలు, మిర్చీలు ఇలా ఇళ్లలో కంటే బయట స్ట్రీట్ ఫుడ్ చాలా టేస్టీగా, స్పైసీగానూ ఉంటుంది. అయితే రోడ్ల పై కొత్తగా చాలా తోపుడు బళ్లు, ఫుడ్ స్టాల్స్ వస్తుండటంతో పోటీ ఎక్కువవుతోంది. దీంతో కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి కొందరు పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. ముంబైలోని ఓ తోపుడు బండిలో దోశలు చేసే వ్యక్తి ఇలాంటి స్టంట్‌తో అందర్నీ తన వైపు తిప్పుకున్నాడు. దోశ తయారైన తర్వాత దాన్ని గాలిలో విసిరి కస్టమర్లకు సర్వ్ చేయడం ఇక్కడ స్పెషల్‌గా చెప్పుకోవాలి. దోశను గాలిలో విసరడానికి పెద్దగా కారణాలు లేకపోయినా పబ్లిక్‌ను ఆకర్షించాలనేదే దీని ఉద్దేశం. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికు ఈ వీడియోకు 84 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ ట్రెండింగ్ ఫ్లయింగ్ దోశ ఎలా ఉంటుందో మీరూ లుక్కేయండి.