మహిళల మిస్సింగ్ కేసుల్లో 87 శాతం ట్రేస్

మహిళల మిస్సింగ్ కేసుల్లో 87 శాతం ట్రేస్
  • విమెన్​ సేఫ్టీ వింగ్​ వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో నమోదవుతున్న మిస్సింగ్  కేసులపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని విమెన్​ సేఫ్టీ వింగ్​ స్పష్టం చేసింది. అదృశ్యమైన బాలికలు, మహిళల్లో 87 శాతం ట్రేస్  చేశామని తెలిపింది. గత 4 ఏండ్లలో నమోదైన కేసుల్లో రికవరీ వివరాలను వింగ్​శనివారం విడుదల చే సింది. 

మహిళలు, చిన్నారుల ట్రేసింగ్​ పర్సెంటేజీ 2019లో 87.30 శాతం కాగా నిరుడు బాలికలన 89 శాతం, మహిళలను 90.56 శాతం గుర్తించామని చెప్పింది. జాతీయ స్థాయిలో 62 శాతం బాలికలు, 53 శాతం మహిళలను మాత్రమే ఆయా రాష్ట్రాలు ట్రేస్  చేస్తున్నాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులను ట్రేస్‌‌ చేయడంలో మొదటిస్థానంలో ఉన్నామని ప్రకటించింది.