ఆయిల్ ట్యాంకర్ పేలి 91 మంది మృతి,100 మందికి గాయాలు

ఆయిల్ ట్యాంకర్ పేలి 91 మంది మృతి,100 మందికి గాయాలు

ఆఫ్రికా దేశం సియర్రా లియోన్ లో ఘోర ప్రమాదం సంభవించింది. రాజధాని ఫ్రీటౌన్ లో గోయిత్రమ్ సూపర్ మార్కెట్ సమీపంలో చమురు ట్యాంకర్ ఓ లారీని ఢీకొట్టింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ పేలి 91 మంది చనిపోయారు.  ఫ్రీటౌన్ లో ఇంధన ట్యాంకర్ ప్రమాదానికి గురైంది.  అయితే ఆ ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు లీకవుతుండగా.. స్థానిక ప్రజలు దాన్ని సేకరించేందుకు పెద్ద ఎత్తున ట్యాంకర్ వద్దకు క్యూ కట్టారు. ఆ ట్యాంకర్ ఉన్నట్టుండి పేలిపోవడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. ఈ ఘటనలో 91 మంది వరకు దుర్మరణం పాలయ్యారు. 100 మంది వరకు ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.

పేలుడు ధాటికి సమీపంలోని షాపులు, రోడ్డుపై వెళ్లే వారికి కూడా మంటలు అంటుకున్నాయి. మృతులు గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. వారి శరీర భాగాలు విసిరేసినట్టుగా చెల్లాచెదురుగా పడ్డాయి.  ఘటనా స్థలానికి చేరుకున్న విపత్తు నిర్వహణ టీంలు  సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 91 మంది డెడ్ బాడీలను  స్వాధీనం చేసుకున్నామని...మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిపారు.ఈ ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు జూలియన్ మాడా బియో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.