ఐడీబీఐలో 920 పోస్టులు

ఐడీబీఐలో 920 పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇండస్ర్టియల్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఐడీబీఐ) కాంట్రాక్ట్​ ప్రాతిపదికన 920 ఎగ్జిక్యూటివ్‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది.
 మొత్తం ఖాళీలు: 920
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌‌ ఉత్తీర్ణత.
వయసు: 2021 జులై 1 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: మొదటి ఏడాది నెలకు రూ.29,000, రెండో ఏడాది నెలకు రూ.31,000, మూడో ఏడాది నెలకు రూ.34,000 చెల్లిస్తారు.
సెలెక్షన్​ ప్రాసెస్​: ఆన్‌‌లైన్‌‌ టెస్ట్‌‌ ఆధారంగా ఎంపిక.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఈ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలుంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు. టెస్ట్‌‌ ఆఫ్‌‌ రీజనింగ్‌‌- 50 ప్రశ్నలు - 50 మార్కులు, టెస్ట్‌‌ వర్కింగ్‌‌ ఇంగ్లిష్‌‌ లాంగ్వేజ్‌‌ - 50 ప్రశ్నలు - 50 మార్కులు, టెస్ట్‌‌ ఆఫ్‌‌ క్వాంటిటేటివ్‌‌ ఆప్టిట్యూడ్‌‌ - 50 ప్రశ్నలు - 50 మార్కులు
దరఖాస్తులు: ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్​ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200, ఇతరులకు రూ.1000. 
చివరితేది: 18 ఆగస్టు 2021; ఎగ్జామ్​: 5 సెప్టెంబర్‌‌
వెబ్‌‌సైట్‌‌: www.idbibank.in