శ్రామిక్ రైళ్లలో 97 మంది వలస కార్మికుల మృతి

శ్రామిక్ రైళ్లలో 97 మంది వలస కార్మికుల మృతి

వెల్లడించిన రైల్వే మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీయూష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: శ్రామిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైన్లలో ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ 97 మంది మైగ్రెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరణించారని కేంద్రం వెల్లడించింది. లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న మైగ్రెంట్ వర్కర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా శ్రామిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైన్లను నడిపింది. మే 1 నుంచి ఆగస్టు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 31వ తేదీ వరకు 4,621 శ్రామిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రైన్లలో 63 లక్షల 19 వేల మంది మైగ్రెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సొంత రాష్ట్రాలకు చేర్చామని రైల్వే మినిస్ట్రీ చెప్పింది. చనిపోయిన వారిలో 87 డెత్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అసహజ మరణాలుగా పరిగణించి సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 174 కింద ఆయా రాష్ట్రాల పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపింది. తృణమూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంపీ డెరెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓబ్రెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు రైల్వే మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీయూష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిటెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు.