కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లకు భారీ షాక్.. నిషేధిత జాబితాలోకి ముగ్గురి ఆస్తులు

కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లకు భారీ షాక్.. నిషేధిత జాబితాలోకి ముగ్గురి ఆస్తులు

హైదరాబాద్: కాళేశ్వరం అవినీతి ఇంజనీర్లకు భారీ షాక్ ఇచ్చారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన ఇంజనీర్లు హరిరాం, నూనె శ్రీధర్, మురళీధర్ ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారు అధికారులు. ఈ మేరకు వీరి ఆస్తుల వివరాలను నిషేధిత జాబితా‎లో పొందుపర్చారు. కోర్టులో కేసు తేలే వరకు ఎలాంటి క్రయవిక్రయాలు జరపకుండా ఆదేశాలు జారీ చేశారు అధికారులు. 

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇంజనీర్లు హరిరాం, నూనె శ్రీధర్, మురళీధర్ లను ఏసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరు ముగ్గురు బెయిల్ మీద బయట ఉన్నారు. వీరి ముగ్గురి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‎లో రూ.400 కోట్లు పైబడే ఉంటుందని అంచనా. ఈ క్రమంలోనే కేసు ముగిసే వరకు వీళ్లు ముగ్గురు ఆస్తుల క్రయవిక్రయాలు జరపకుండా అటాచ్ చేశారు అధికారులు.