బొద్దింకల పార్టీ అస్సలు తగ్గట్లేదుగా... బ్లింకిట్ లో ఆన్ లైన్ పార్టీ క్యాంపెయిన్...

బొద్దింకల పార్టీ అస్సలు తగ్గట్లేదుగా... బ్లింకిట్ లో ఆన్ లైన్ పార్టీ క్యాంపెయిన్...

బొద్దింకల పార్టీ సృష్టిస్తున్న ప్రకంపనల గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన పని లేదు. స్థాపించిన నాలుగు రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ లో బీజేపీని బీట్ చేసి రికార్డ్ సృష్టించి ఇప్పుడు 20 మిలియన్ దిశగా దూసుకుపోతోంది. బొద్దింకల పార్టీ రిలీజ్ చేసిన ఆంథం సాంగ్ కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పుడు కాక్ రోచ్ పార్టీ గురించి ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. బ్లింకిట్ డెలివరీ బాయ్ ఆర్డర్ తో పాటు బొద్దింకల పార్టీ స్టిక్కర్స్ ఇస్తున్న వీడియో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

ఢిల్లీలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బ్లింకిట్ ఆర్డర్ తెచ్చిన డెలివరీ బాయ్ అందులో కాక్ రోచ్ ఉందంటూ కస్టమర్ కి ఇస్తాడు. డెలివరీ బాయ్ మాటలతో షాక్ అయిన కస్టమర్ కవర్ లో చూడగా... బొద్దింకల పార్టీ ఎలక్షన్ సింబల్ స్టిక్కర్లు ఉండటంతో వీడియో వైరల్ గా మారింది. బొద్దింకల పార్టీ క్రియేటివిటీకి సదరు కస్టమర్ తో పాటు నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు.

కాక్ రోచ్ పార్టీ స్పీడ్ చూస్తుంటే ఇండియాలో కూడా జెన్ జీ విప్లవం వస్తుందని అనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ ని ఆన్ లైన్ లో పుట్టిన పార్టీ వణికిస్తోందని మరికొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ స్పీడ్ ఇలాగే కంటిన్యూ అయితే... ఇండియాలో ప్రతి ఎలక్షన్ కాక్ రోచ్ పార్టీ విన్ అవుతుందని అంటున్నారు మరికొంతమంది నెటిజన్స్.