వడదెబ్బతో  ఇద్దరు పిల్లలు మృతి

వడదెబ్బతో  ఇద్దరు పిల్లలు మృతి

రాయపర్తి/  ధర్మపురి, వెలుగు: వడదెబ్బకు వరంగల్​ జిల్లాలో ఓ బాలుడు, జగిత్యాల జిల్లాలో ఓ బాలిక మృతి చెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం గట్టిగల్లు గ్రామానికి చెందిన  మణికంఠ(10) ఇటీవల తల్లిదం డ్రులతో కలిసి హైదరాబాద్​కు వెళ్లాడు. ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురై  వాంతులు చేసు కొని గురువారం మృతి చెందాడు. కాగా, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన అల్ఫియా ఐమాన్(11) వడదెబ్బతో చనిపోయింది. బుధవారం అల్ఫియా ఇంటి వద్ద పిల్లలతో ఆడుకొని అలసటతో పలుమార్లు వాంతి చేసుకుంది.  ఈక్రమంలో గురువారం తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతిచెందింది.  చిన్నారికి గతంలో హార్ట్​సమస్య ఉందని  కుటుంబ సభ్యులు చెప్పారు.