శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై మంటల్లో కాలిపోయిన కారు..

శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్డుపై మంటల్లో కాలిపోయిన కారు..

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ రోడ్డుపై వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే మొన్న జులై 11న ఆటోను బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయాలపాలైన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా అదే రోడ్డుపై.. విమానాశ్రయానికి సమీపంలో కారు ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేసింది.

ఆదివారం (జులై 13) శంషాబాద్ నాకా దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఉదయం 10.55 నిమిషాల ప్రాంతంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఏదో కాలిపోయిన వాసన వస్తున్నట్లు గుర్తించిన డ్రైవర్.. వెంటనే అప్రమత్తమై అందరినీ కిందకు దించాడు. 

స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది, పెట్రోలింగ్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు.  11.05 గంటలకు మంటలు ఆర్పారు అధికారులు.  ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడం గమనార్హం. అయితే ఫైర్ యాక్సిండెట్ మూలంగా ట్రాఫిక్ భారీ ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు.