సికింద్రాబాద్ గాంధీలో పిల్లల కోసం సెంటర్ ఆఫ్​ ఎక్సలెన్స్

సికింద్రాబాద్ గాంధీలో పిల్లల కోసం సెంటర్ ఆఫ్​ ఎక్సలెన్స్

పిల్లల కోసం సెంటర్ ఆఫ్​ ఎక్సలెన్స్
గాంధీ సూపరింటెండెంట్ డా.రాజారావు

పద్మారావునగర్, వెలుగు : వరల్డ్ డయాబెటిక్ డేను పురస్కరించుకొని గాంధీ హాస్పిటల్​లో సోమవారం సెంటర్​ ఆఫ్​ఎక్సలెన్స్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్​డా.రాజారావు మాట్లాడుతూ.. ఎండోక్రనాలజీ డిపార్ట్‌మెంట్‌, నోవోనోర్డిస్క్​ ఎడ్యుకేషన్​ ఫౌండేషన్​ సహకారంతో ఈ సెంటర్​ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లల్లో డయాబెటిస్‌ గుర్తించి చికిత్స అందించేందుకు ఇది ఉపయోగపడనుందని చెప్పారు. ఈ సెంటర్​లో19 ఏండ్లలోపు వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. అనంతరం హాస్పిటల్​ఆవరణలో డయాబెటిస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో ఎండోక్రనాలజీ​హెచ్ఓడీ విజయ్​శేఖర్ రెడ్డి, నోవోనోర్డిస్క్​ ఎడ్యుకేషన్​ కార్పొరేట్​వైస్ ప్రెసిడెంట్​విక్రాంత్​ క్షత్రియ, డాక్టర్లు, సిబ్బంది, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే వరల్డ్​యాంటీ మైక్రోబియల్​అవేర్నెస్​వీక్​–2022 పురస్కరించుకొని యాంటీ మైక్రోబియల్​వినియోగం, వాటివల్ల కలిగే సైడ్​ఎఫెక్ట్ లపై హాస్పిటల్​లో సోమవారం చర్చ నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రమ్య, డా.మణిపాల్, డా. జి.జె. అర్చన, డా.పద్మజ పలు అంశాలపై ప్రసంగించారు. సూపరింటెండెంట్​ రాజారావుతోపాటు మైక్రోబయాలజీ హెచ్ఓడీ డా.ఎస్.రాజేశ్వర్​రావుతోపాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.