రోడ్లపైన వడ్లు ఆరబోస్తున్నారా.. మీకు ఈ పరిస్థితి రాకుండా చూసుకోండి!

రోడ్లపైన వడ్లు ఆరబోస్తున్నారా.. మీకు ఈ పరిస్థితి రాకుండా చూసుకోండి!

ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు.. ధాన్యం ఆరబెట్టుకోవడానికి కల్లాలు లేకపోవడంతో రోడ్లపైన ఆరబెట్టుకోవడం చూస్తూనే ఉంటాం. పొద్దంతా ఆరబెట్టి రాత్రికి కుప్పగా చేసి లేదంటే సంచుల్లో నింపి కవర్లు కప్పి ఇంటికెళ్తుంటారు. అయితే ఈ ధాన్యం కారణంగా అక్కడక్కడా ప్రమాదాలు జరుగుతున్నాయి. 

సిద్దిపేట జిల్లాలో రహదారిపై వడ్ల సంచులు పెట్టడంతో ప్రమాదానికి గురై ఒక వ్యక్తి మృతి చెందాడు. వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. డిసెంబర్12న అక్బర్ పేట్ భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామానికి చెందిన మటన్ దుకాణాన్ని నిర్వహించే గజబింకార్ ఈశ్వర్ లాల్(48) మృతి చెందాడు.

భూంపల్లి పీహెచ్సీ సమీపంలో రహదారిపై నలుపు రంగు ప్లాస్టిక్ కవర్లతో కప్పబడిన వడ్ల సంచులను ఢీకొని, అక్కడికక్కడే మృతి చెందాడు ఈశ్వర్ లాల్. మృతుడి భార్య అరుణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వడ్ల సంచులు రోడ్డుపై ఉంచిన వ్యక్తిని అరెస్టు చేశారు.