నాలాలో పడి ఓ చిన్నారి మృతి

నాలాలో పడి ఓ చిన్నారి మృతి

సికింద్రాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది.  నాలాలో పడి ఓ చిన్నారి మృతి చెందింది. సికింద్రాబాద్ లోని కళాసిగూడ వద్ద ప్రమాదవశాత్తు నాలాలో చిన్నారి పడింది.  నాలా పుట్ పాత్ పైకప్పు నుంచి పడి మౌనిక(6) చిన్నారి మృతి చెందింది. 

తెల్లవారుజాము నుంచి కళాసిగూడలో ఎడతెరపిలేకుండా కురుస్తోంది.  దీంతో రోడ్లపైకి వర్షపునీరు పారుతోంది.  డ్రైనేజీ పనులు జరుగుతుండటంతో మ్యాన్ హోల్  మూత తెరిచి ఉంచారు.  అది గమనించని చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా అందులో పడింది. దీంతో చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. కిరాణ షాపు కు పాల పాకెట్ కోసం వెళ్లగా..ఈ దుర్షఘటన చోటు చేసుకుంది. పార్క్ లైన్ వద్ద పాప మృతదేహాన్ని  DRF  సిబ్బంది గుర్తించారు.  స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.