వీడియో వైరల్​: తల్లికోసం జైలు గేటు దగ్గర చిన్నారి ఏడుపు

వీడియో వైరల్​: తల్లికోసం జైలు గేటు దగ్గర చిన్నారి ఏడుపు

ఒక్క క్షణం తల్లి కనపడకపోతే అల్లాడిపోయో చిన్నారులుంటారు.  మరి తల్లి జైల్లో ఉంటే ... ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు... ఎలా చూడాలో కూడా చిన్నారులకు తెలియని పరిస్థితి.. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఘటనే  ఆంధ్రప్రదేశ్​ లో చోటు చేసుకుంది.   తల్లికోసం జైలు గేటు దగ్గర ఏడుస్తున్న చిన్నారి వీడియో వైరల్​ అయింది. 

ఓ హృదయవిధార ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. జైల్లో ఉన్న తల్లి కోసం జైలు బయట చిన్నారి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ చిన్నారి కన్నీళ్లు అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది..

వివరాల్లోకి వెళితే.. కర్నూల్‌లో మహిళా సబ్ జైలు బయట 9 ఏళ్ల బాలిక ఏడుస్తుండడాన్ని ఓ బాటసారి గమనించారు. దాన్ని వీడియో తీశాడు. ఆ చిన్నారి తన తల్లిని కలవడానికి అనుమతించమని ఏడుస్తోంది. దాన్ని మొత్తం ఆ వ్యక్తి రికార్డ్ చేశాడు.. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా, క్షణాల్లో వైరల్ అయ్యింది.. తల్లి కోసం కూతురు పడుతున్న ఆవేదన అందరిని కరిగించింది..

ఖాదీజా బీ అనే మహిళ భర్త వదిలెయ్యడంతో కుటుంబ పోషణ కోసం దొంగగా మారింది.. ఓ దొంగతనం కేసులో డిసెంబర్ 12న జైలు పాలైంది. భర్త వదిలేయడంతో కుటుంబ పోషణ భారం అయ్యి, చిన్న చిన్న నేరాలకు పాల్పడింది. దీంతో ప్రస్తుతం ఆమెను జైలుకు వెళ్లేలా చేసింది. ఈ విషయాలు తరువాత తెలిసాయి.. ఈమెకు ఐదుగురు సంతానం.. వారిలో ఒకరే ఈ తొమ్మిదేళ్ల బాలిక. తల్లిని కలవాలంటూ రోధిస్తుంది. ఈ వీడియో తీసిన తరువాత ఆ వ్యక్తి వెంటనే జైలు సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకుని, వెంటనే బాలికను తన తల్లితో కలవడానికి అనుమతి ఇచ్చారు.. ఆ తల్లిని మందలించి జైలు నుంచి విడుదల చేసినట్లు తెలుస్తుంది.. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..