చైనా కంపెనీ భారీ మోసం.. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ తో రూ.1100 కోట్లు మాయం

చైనా కంపెనీ భారీ మోసం.. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ తో రూ.1100 కోట్లు మాయం

చైనాకు చెందిన ఓ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్ పేర్లతో దేశవ్యాప్తంగా రూ.వెయ్యి కోట్ల వరకు చైనా కంపెనీ వసూలు చేసింది. పలువురి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చైనాకు చెందిన వ్యక్తితో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ దీనిపై మాట్లాడుతూ.. “ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ గేమింగ్ అనేది పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రభుత్వం ఆన్ లైన్ గేమింగ్‌ను నిషేధించింది. ఆన్ లైన్ గేమింగ్ తో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. టెక్స్ట్, ఇమేజ్ బేస్, వీడియో బేస్ ల ద్వారా ఆన్ లైన్ గేమింగ్ నడుస్తున్నాయి.ఇండియా లోని యూత్ ను టార్గెట్ గా చేసుకొని ఈ చైనా ఆన్ లైన్ గేమ్ కంపెనీలు మోసం చేస్తున్నాయి.

టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా రెఫరెన్స్ తోటి ఈ ఆన్ లైన్ గేమింగ్ లోకి ఎంటర్ చేస్తారు. బెట్టింగ్‌తో న‌డిచే ఈ చైనీస్ గేమింగ్ లో బెట్టింగ్ పెట్టి ఎంతో మంది మోస పోతున్నారు. డేటా స్టోరేజ్ అంతా చైనా బేస్డ్ తో క్లాప్డ్ లో సేవ్ అయ్యేలా చూసుకుంటారు. రూ. 1100 కోట్లు వరకు ఈ గేమ్స్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని” సీపీ తెలిపారు.

ఇండియా లో గేమింగ్ ఆడిన డబ్బులు మొత్తం గుర్గావ్ లోని HSBC కి వెళ్ళిందని తెలిపారు. ఇంకా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంద‌ని చెప్పారు. ఈ ఆన్ లైన్ గేమ్ లో మోసపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని సీపీ చెప్పారు. సీసీఎస్‌ డీసీపీ అవినాష్‌ మహంతి ఆధ్వర్యంలో ఈ కేసుత దర్యాప్తు జరుగుతోంది. కాగా.. లాక్‌డౌన్‌ సమయంలో ఇంత పెద్ద మొత్తంలో మోసం జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.